Share News

Morning Fatigue Causes: ఉదయం అలసటగా అనిపిస్తుందా? మీ ఆరోగ్యం చెబుతున్న సంకేతం ఇదే.!

ABN , Publish Date - Jan 12 , 2026 | 08:50 AM

ఉదయం నిద్రలేవగానే శరీరం అలసటగా, బరువుగా, నీరసంగా అనిపిస్తోందా? రాత్రి బాగా నిద్రపోయినా ఇలాగే అనిపిస్తుందా? అయితే.. ఈ అలసట వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Morning Fatigue Causes: ఉదయం అలసటగా అనిపిస్తుందా?  మీ ఆరోగ్యం చెబుతున్న సంకేతం ఇదే.!
Morning Fatigue Causes

ఇంటర్నెట్ డెస్క్: ఉదయం నిద్రలేవగానే శరీరం బరువుగా, నీరసంగా, అలసటగా అనిపిస్తోందా? రాత్రి బాగా నిద్రపోయినా ఉత్సాహం లేకుండా ఉందా? అయితే.. దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది మీ శరీరం ఇస్తున్న ముఖ్యమైన సంకేతం కావచ్చు. శీతాకాలంలో చాలామందికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చలి కారణంగా బయటకు వెళ్లడం తగ్గిపోవడం, ఎక్కువసేపు నిద్రపోవడం, సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల శరీరం మందగిస్తుంది. కొందరికి తలనొప్పి, మరికొందరికి శరీర నొప్పులు, ఇంకొందరికి సోమరితనం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి ప్రతిరోజూ ఉంటే.. దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం.


నిద్ర నాణ్యత తగ్గిపోవడం

రాత్రి ఆలస్యంగా పడుకోవడం, మధ్యలో మేల్కొనడం, నిద్రకు ముందు మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన సరిగ్గా నిద్రపోలేరు. దాంతో శరీరం అలసటగా అనిపిస్తుంది.

శరీరంలో నీరు తక్కువగా ఉండటం

చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా.. శరీరానికి నీరు అవసరమే. నీరు తక్కువైతే కండరాలు బలహీనపడతాయి, ఉదయం నీరసంగా అనిపిస్తుంది.

విటమిన్ డి లోపం

శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. ఇది శక్తి తగ్గడానికి, త్వరగా అలసిపోవడానికి కారణమవుతుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన

ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం, టెన్షన్, ఒత్తిడి వల్ల మనసు విశ్రాంతి పొందదు. ఫలితంగా సరైన నిద్ర ఉన్నా ఉదయం అలసటగా అనిపిస్తుంది.

శారీరక చురుకుదనం లేకపోవడం

చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, కదలిక తగ్గిపోవడం వల్ల శరీరం మందగిస్తుంది. కండరాలు చురుకుగా పనిచేయవు. అందువల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది.


శరీరం చురుకుగా ఉండాలంటే..

  • ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగండి.

  • రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్రలేవండి.

  • దాహం ఉన్నా లేకపోయినా, రోజంతా నీరు తాగండి.

  • ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయాలి.

  • రోజుకు కొంతసేపు ఉదయం ఎండలో కూర్చోండి.

  • సమతుల్య ఆహారం తీసుకోండి, వేయించిన ఆహార పదార్థాలు తగ్గించాలి.

  • నిద్రపోయే ముందు మొబైల్, టీవీ చూడటం మానేయండి.

  • అయినప్పటికీ రోజూ అలసటగా అనిపిస్తే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇది లోపల దాగిఉన్న ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 12 , 2026 | 09:36 AM