Share News

యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్.. కారణాలు తెలుసుకోండి

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:54 PM

ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ సమస్య పలువురిని ఆందోళన కలిగిస్తోంది. యువతలో ఈ వ్యాధి వేగంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి? దీన్ని ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్.. కారణాలు తెలుసుకోండి
Fatty Liver Causes

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. గతంలో 40-50 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 20-30 ఏళ్ల యువత సహా పిల్లల్లోనూ కనిపిస్తోంది. నిపుణుల ప్రకారం.. మారుతున్న ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం మద్యపానం సేవించని వారిలోనూ ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. రోజూ బయటి ఆహారం తినడం, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం, అధికంగా శీతల పానీయాలు, స్వీట్లు, వేయించిన పదార్థాలు తినడం వంటివి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి.


ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది?

కాలేయంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతే ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. దీనిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) అంటారు. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2 దశలుగా ఉండి, తర్వాత లివర్ ఫైబ్రోసిస్, చివరికి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. సిర్రోసిస్ దశ చాలా ప్రమాదకరమైనది. ఆ దశకు చేరుకుంటే లివర్ మార్పిడి అవసరం కావచ్చు.


ప్రారంభ లక్షణాలు

మొదట్లో ఈ వ్యాధికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ క్రమంగా అలసట, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ప్రారంభ దశలో గుర్తిస్తే ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడం సులభం.


ఎలా నివారించాలి?

  • రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

  • జంక్ ఫుడ్, మైదా పదార్థాల వంటివి తగ్గించాలి.

  • రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

  • శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

  • రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించాలి.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. చిన్న వయసులోనే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 20 , 2026 | 03:20 PM