Share News

రొమ్ము క్యాన్సర్.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?

ABN , Publish Date - Feb 19 , 2026 | 06:17 PM

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే సరైన ఆహారపు అలవాట్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా దీని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు..

రొమ్ము క్యాన్సర్.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
Breast Cancer Prevention Diet

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో సరైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం, హానికరమైన ఆహారాలను దూరంగా ఉంచడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేయొచ్చు.


ఫైబర్ అధికంగా ఉండే ఆహారం..

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, ఆకుకూరలు, క్యారెట్, ఆపిల్, బేరి వంటి పండ్లు, కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తగ్గించండి..

అధిక కొవ్వు ఉన్న ఆహారం.. గుండె జబ్బులు మాత్రమే కాకుండా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు. ముఖ్యంగా రెడ్ మీట్, పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తగ్గించడం మంచిది.


సేంద్రీయ ఆహారాలకు ప్రాధాన్యం..

సేంద్రీయ ఆహారాల్లో హానికరమైన రసాయనాలు, పురుగుమందులు తక్కువగా ఉంటాయి. అందువల్ల, వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సేంద్రీయ కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

క్రూసిఫెరస్ కూరగాయలు..

కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.


చిరుధాన్యాలు..

జొన్నలు, రాగులు, సామలు వంటి చిరుధాన్యాల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటూ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 19 , 2026 | 06:47 PM