జంక్ ఫుడ్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా ఫ్యాటీ లివర్‌కు కారణమే!
ABN , Publish Date - May 08 , 2026 | 06:25 PM
ఫ్యాటీ లివర్ సమస్య కేవలం జంక్ ఫుడ్ తినడం వల్లే వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, రోజువారీ అలవాట్లు కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. చాలామంది ఇది కేవలం వేయించిన లేదా జంక్ ఫుడ్ తినడం వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ, కొన్ని రోజువారీ అలవాట్లు కూడా ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఫ్యాటీ లివర్‌కు కారణమయ్యే అలవాట్లు
తీపి పదార్థాలు ఎక్కువగా తినడం: శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు వంటి చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.
రోజంతా కూర్చునే అలవాటు: శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుంది.
సరిగా నిద్రపోకపోవడం: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతిని కాలేయంపై ప్రభావం పడుతుంది.
అధిక ఒత్తిడి: ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల హార్మోన్ల మార్పులు జరిగి కాలేయ పనితీరుపై ప్రభావం చూపవచ్చు.
ఆకస్మికంగా బరువు పెరగడం: ఊబకాయం లేదా వేగంగా బరువు పెరగడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి మంచి అలవాట్లు పాటిస్తే ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!
For More Latest News