Share News

పెరుగుతోన్న ఈ-సిగరెట్ల వినియోగం

ABN , Publish Date - May 03 , 2026 | 05:29 PM

దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్నప్పటికీ వాటి వినియోగం తగ్గడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కార్పొరేట్ కార్యాలయాల పరిసరాల నుంచి పాఠశాలలు, కళాశాలల దగ్గర వరకూ ఈ-సిగరెట్ల వాడకం ఆందోళన కలిగిస్తోంది.

పెరుగుతోన్న ఈ-సిగరెట్ల వినియోగం
E-Cigarette Use In India

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఈ-సిగరెట్ల వినియోగం మళ్లీ పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా పాల్గొన్నారు. సర్వే ప్రకారం.. దేశంలో విచ్చలవిడిగా ఈ-సిగరెట్ల వినియోగం ఉందని సుమారు 22 శాతం మంది తెలిపారు. ముఖ్యంగా, కార్పొరేట్ కార్యాలయాల పరిసరాల్లో ఈ సిగరెట్లు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు 52 శాతం మంది వెల్లడించారు.


అదే విధంగా, 39 శాతం మంది రెస్టారెంట్లు, క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీల్లో, 34 శాతం మంది వీధుల్లో, 19 శాతం మంది పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఈ-సిగరెట్ల వాడకం కనిపించిందని పేర్కొన్నారు. 2019లో భారత ప్రభుత్వం ఈ-సిగరెట్లపై పూర్తిగా నిషేధం విధించింది. ఆరోగ్యానికి ఇవి హానికరమని, ముఖ్యంగా యువతలో నికోటిన్ వ్యసనం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2022 నుంచి ఇప్పటివరకు కనీసం 350 సార్లు ఈ నిషేధం ఉల్లంఘించారు. అయితే అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.


యువతపై ప్రభావం

పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఈ-సిగరెట్ల వినియోగం కనిపించడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఈ వయసు వారు త్వరగా అలవాట్లకు లోనవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్నప్పటికీ, వాటి వినియోగం పూర్తిగా తగ్గలేదు. కఠినమైన అమలు, ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంచడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - May 03 , 2026 | 06:44 PM