రోజూ అన్నం తింటే మధుమేహం వస్తుందా?
ABN , Publish Date - May 03 , 2026 | 01:40 PM
రోజూ అన్నం తినడం వల్ల మధుమేహం వస్తుందా? అన్నం తింటే మధుమేహం వస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అన్నం తింటే షుగర్ వస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. భారతీయ ఆహారంలో అన్నం, గోధుమ వంటకాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. కానీ ఇప్పుడు చాలా మంది ఆరోగ్య భయాలతో అన్నం పూర్తిగా మానేస్తున్నారు.
అయితే.. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మధుమేహం కేవలం అన్నం వల్ల రాదు. ఊబకాయం (ఓవర్ వెయిట్), వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, జీవనశైలిలో మార్పులు, రోజంతా కూర్చునే అలవాటు వంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయి. అలాగే.. చాక్లెట్లు, స్వీట్లు, బేకరీ పదార్థాలు, బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. అంతేకాకుండా ఆలస్యంగా తినడం, త్వరగా తినడం వంటి అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయి.
అన్నం పూర్తిగా మానేయాలా?
అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. బదులుగా మితంగా తినడం మంచిది. రోజువారీ ఆహారంలో సమతుల్యత ఉండాలి. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్, రాగి వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారాలు మంచివి. వీటితో రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి?
ఇది ఒక ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత వేగంగా పెరుగుతుందో చూపించే కొలమానం.
తక్కువ GI: పప్పులు, గోధుమ, కూరగాయలు
మధ్యస్థ GI: బ్రౌన్ రైస్, ఓట్స్
అధిక GI: తెల్ల బియ్యం, చక్కెర పదార్థాలు
అన్నం తినడం వల్లనే మధుమేహం వస్తుంది అనుకోవడం తప్పు. మితంగా తినడం, వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News