డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.!
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:39 PM
డయాబెటిస్ వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని తొలిదశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక జీవనశైలిలో డయాబెటిస్ ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న వయసులోనే చాలా మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. డయాబెటిస్ వచ్చే ముందు నుంచే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని తొలిదశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం.. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం వల్ల 30ఏళ్ల లోపే మధుమేహం వస్తోంది. క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. దీని వల్ల గుండె, కళ్లు, మూత్రపిండాలు, నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
గతంలో మనుషులు ఎక్కువగా శారీరకంగా పని చేసేవారు. కానీ ఇప్పుడు వ్యాయామం తగ్గి, ఒత్తిడి పెరిగింది. పైగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవన్నీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ వచ్చే ముందే కనిపించే కొన్ని ముఖ్య లక్షణాలు..
ఎక్కువ దాహం వేయడం, తరచూ టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం డయాబెటిస్‌కు ముఖ్య సంకేతాలు. శరీరంలో చక్కెర పెరిగితే అది మూత్రం ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
డయాబెటిస్ ఉన్నవారికి ఉదయాన్నే అలసటగా, నీరసంగా అనిపించవచ్చు. బాగా తిన్నా, నిద్రపోయినా శక్తి లేకపోవడం కనిపిస్తుంది. శరీరం గ్లూకోజ్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
మెడ వద్ద నల్లటి మచ్చలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఇది ఇన్సులిన్ సరిగా పనిచేయడం లేదన్న సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయడం, ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనిపించడం కూడా డయాబెటిస్ లక్షణాలు. రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది.
భోజనం చేసిన తర్వాత కళ్లు మసకగా కనిపించడం, తలనొప్పి రావడం పదే పదే జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది రక్తంలో చక్కెర ఎక్కువగా పెరగడం లేదా తగ్గడం వల్ల జరుగుతుంది.
అకస్మాత్తుగా బరువు పెరగడం డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వాటిని సాధారణంగా తీసుకోకుండా శరీరం ఇస్తున్న హెచ్చరికలుగా భావించాలి. ముందుగానే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్‌ను నియంత్రించ వచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News