డయాబెటిస్‍తో మతిమరుపు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:14 AM
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ అనేది పెనుభూతంగా మారిన సంగతి తెలిసిందే. భారతదేశంలోనూ షుగర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కడుపు నిండా ఏది తిందామన్నా రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కడ పెరిగిపోతాయోననే భయం వారిని వెంటాడుతూనే ఉంది. అందుకే భోజనం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. లెక్కలేసుకుని మరీ ఎంత తినాలో అంతే తింటుంటారు. అలాగే షుగర్‌తో వచ్చే ఇతర ఆరోగ్య ప్రమాదాల గురించీ ఎంతో అప్రమత్తంగా ఉంటుంటారు. అలాంటి డయాబెటిస్ రోగులకు మరో షాకింగ్ న్యూస్. వారికి మతిమరుపు వచ్చే ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణ వ్యక్తుల కంటే వీరికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని జెన్నిఫర్ తెలిపారు. సుమారు 2.83లక్షల మందిపై సుదీర్ఘ అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన న్యూరాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి భవిష్యత్తులో మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం 3 రెట్లు అధికంగా ఉందని.. టైప్-2 డయాబెటిస్ వచ్చే వారికి ఈ ముప్పు 2 రెట్లు అధికంగా ఉందని అధ్యయనం చెబుతోంది.
సాధారణ వ్యక్తులకు అంటే డయాబెటిస్ లేని వారిలో కేవలం 0.6 శాతం మందికి మాత్రమే డిమెన్షియా రాగా.. టైప్-1 బాధితుల్లో 2.6శాతం మందికి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టైప్-1 డయాబెటిస్ మొత్తం డయాబెటిస్ కేసుల్లో 5 శాతమే అయినా.. మెదడుపై చాలా ప్రభావం చూపిస్తుందని జెన్నిఫర్ చెబుతున్నారు. ఇలాంటి వారిలో 65 శాతం డిమెన్షియా కేసులను నేరుగా షుగర్ వ్యాధికే ఆపాదించవచ్చని ఆమె వివరించారు. ఈ అధ్యయనం డయాబెటిస్, డిమెన్షియా మధ్య సంబంధాన్ని మాత్రమే చూపించిందని.. దీన్ని ఇంకా శాస్త్రీయంగా నిరూపించలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవడమే మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెల్తీ డైట్‌తో షుగర్ వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News