గుండె ఆరోగ్యానికి ఏ నూనె మంచిది?
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:49 PM
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వంట నూనె వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అవసరానికి మించి నూనె వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వంట నూనె ఎంపిక చాలా కీలకమైనది. భారతీయ వంటల్లో నూనె తప్పనిసరి అయినప్పటికీ.. దాన్ని ఎంత పరిమాణంలో వాడుతున్నామన్నది చాలా ముఖ్యం. ఎక్కువ నూనె వాడటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వంట నూనె ఆహారానికి రుచి, వాసన, మెత్తదనం ఇస్తుంది. కూరగాయలు, మాంసాహారం సమానంగా ఉడికేందుకు కూడా సహాయపడుతుంది. అయితే నూనెను పదే పదే వేడి చేయడం లేదా అధికంగా వాడటం గుండెకు హానికరం. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరగడానికి అధిక నూనె వినియోగం కూడా ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు.
రోజుకు ఎంత నూనె వాడాలి?
వైద్యుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు 25 నుండి 30 మిల్లీలీటర్ల (సుమారు 2 టేబుల్ స్పూన్లు) నూనె మాత్రమే తీసుకోవాలి. వారానికి మొత్తం 150 నుండి 170 మిల్లీ లీటర్ల నూనె సరిపోతుంది. ఈ పరిమాణంలో వంట నూనెతో పాటు వేయించిన ఆహారం, బేకరీ పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉండే నూనె కూడా లెక్కలోకి వస్తుంది.
ఎక్కువ నూనె వాడితే ఏమవుతుంది?
అధికంగా నూనె తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అలాగే ఊబకాయ సమస్య తలెత్తడంతో పాటూ అధిక రక్తపోటు, మధుమేహ ప్రమాదం పెరుగుతుంది.
గుండె ఆరోగ్యానికి ఏ నూనె మంచిది?
నిపుణుల ప్రకారం.. గుండె ఆరోగ్యానికి ఈ నూనెలు మంచివి:
ఆలివ్ నూనె
వేరుశెనగ నూనె
నువ్వుల నూనె
చియా సీడ్ ఆయిల్
అవోకాడో ఆయిల్
జాగ్రత్తలు..
నూనెను పదే పదే వేడి చేయకూడదు.
నాన్‌స్టిక్ లేదా ఇనుప పాత్రలు వాడితే తక్కువ నూనె సరిపోతుంది.
నూనెను చెంచాతో కొలిచి వాడాలి.
వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించాలి.
తక్కువ నూనె వాడటం, సరైన నూనె ఎంపిక చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News