Share News

Castor Oil Health Benefits: ఆముదం ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది?

ABN , Publish Date - Jan 15 , 2026 | 01:05 PM

మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది ఆముదం నూనె. అయితే, ఆముదం ఆరోగ్యానికి నిజంగా మేలు చేస్తుందా? ఈ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుందా?..

Castor Oil Health Benefits: ఆముదం ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది?
Castor Oil Benefits

ఇంటర్నెట్ డెస్క్: ఆముదం నూనెను మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు ఇది మంచిదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ వంటి పేగు సమస్యల సమయంలో చాలామంది ఆముదాన్ని ఆశ్రయిస్తారు. అయితే నిజంగా ఆముదం పేగులను శుభ్రపరుస్తుందా? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఆముదంలో ఉండే రిసినోలిక్ ఆమ్లం జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది పేగుల కదలికను ఉత్తేజపరిచి, మల విసర్జన సులభంగా అయ్యేలా చేస్తుంది. అందుకే మలబద్ధకం ఉన్నవారికి ఆముదం ఉపశమనం ఇస్తుంది.

ఆముదం ఎలా పనిచేస్తుంది?

ఆముదం తీసుకున్నప్పుడు పేగుల కండరాలు చురుకుగా పనిచేస్తాయి. దీంతో ప్రేగుల కదలిక వేగంగా జరుగుతుంది. అలాగే ఇందులోని కొవ్వు ఆమ్లాలు జీర్ణ రసాలను యాక్టివ్ చేస్తాయి. దాంతో ఆహారం జీర్ణనాళంలో సులభంగా ముందుకు సాగుతుంది. ఈ కారణంగానే కొంతమంది దీనిని పేగులు శుభ్రం చేసే నూనెగా భావిస్తారు. అయితే, దీని ప్రభావం వేగంగా ఉంటుంది. సరైన మోతాదు కాకుండా ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, తిమ్మిరి, బలహీనత కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆముదం ఆరోగ్య ప్రయోజనాలు

  • మలబద్ధకాన్ని నివారిస్తుంది.

  • పొడి చర్మాన్ని తగ్గిస్తుంది. ముడతలు, సన్నని గీతలను నివారిస్తుంది. మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

  • జుట్టు కుదుళ్లను పోషించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకలను, కనుబొమ్మలను దట్టంగా మారుస్తుంది.

  • దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాపును తగ్గిస్తాయి.

  • యాంటీమైక్రోబయల్, తేమ లక్షణాల వల్ల గాయాలు త్వరగా మానడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆముదం నూనె సహాయపడుతుంది.

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  • శరీరంలోని లవణాలు, విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.


జాగ్రత్తలు

  • ఆముదాన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.

  • ఖాళీ కడుపుతో తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

  • గర్భిణీ స్త్రీలు ఆముదం తీసుకోకూడదు.

  • చిన్న పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా ఇవ్వకూడదు.

  • ఎక్కువగా వాడితే విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత రావచ్చు.

ఆముదం తాత్కాలికంగా మలబద్ధకం సమస్యకు ఉపశమనం ఇస్తుంది కానీ దీన్ని రోజూ అలవాటుగా వాడటం మంచిది కాదు. సమస్య ఎక్కువ రోజులు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 15 , 2026 | 02:00 PM