రోజూ ఈ జ్యూస్ తాగితే.. మీ పొట్ట తగ్గడం ఖాయం!
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:48 PM
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’(పొట్ట). ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’(పొట్ట). ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు, మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అయితే, కఠినమైన వ్యాయామం, డైటింగ్ చేయలేని వారికి సహజసిద్ధమైన పానీయాలతో ‘బెల్లీ ఫ్యాట్’కి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజ సిద్ధంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కడుపు చుట్టూ ఉన్న కొవ్వును కరిగించి, మిమ్ముల్ని ఆరోగ్యంగా, స్లిమ్‌గా మార్చే జ్యూస్‌ల గురించి తెలుసుకుందాం.
1. పుచ్చకాయ రసం:
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. తద్వారా మీరు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇందులో ఉండే ‘అర్జినైస్’ అనే అమైనో యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
2.దోసకాయ-పుదీనా రసం:
దోసకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. పూదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి జ్యూస్ చేసుకొని తాగిగే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
3. కర్పూజ రసం:
కర్బూజలో విటమిస్ సి, పీచు పదార్థం(ఫైబర్) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచి పొట్ట పెరగకుండా చూస్తుంది.
4. అల్లం-నిమ్మరసం:
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, కొంచెం అల్లం రసం కలుపుకొని ఉదయాన్నే తాగితే మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించే ‘నేచురల్ డిటాక్స్ డ్రింక్’లా పనిచేస్తుంది.
5. కలబంద రసం:
కలబంద రసం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. రోజూ పరిగడుపున కొద్దిగా కలబంద రసం తాగడం వ్లల బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంటుంది.
6. సొరకార రసం:
సొరకాయలో పీచు పదార్ధం(ఫైబర్) అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ. ఇది శరీరానికి చలువ చేయడమే కాకుండా, ఆకలిని నియంత్రించి కడుపు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది.
7. కరివేపాకు-నిమ్మరసం:
కరివేపాకు కొవ్వును కరిగించే గుణాలను కలిగి ఉంటుంది. గుప్పెడు కరివేపాకులను మిక్సీ పట్టి, ఆ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే మొండి కొవ్వు కూడా కరుగుతుంది.
8. గ్రీన్ టీ- తేనె:
ఇది జ్యూస్ కాకపోయినా, బరువు తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన పానీయం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని మెటబాలిజంను పెంచి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News