Share News

బీట్‌రూట్ ఆరోగ్యానికి అమృతం.. తెలిస్తే అస్సలు వదలరు!

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:42 PM

భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సెగలు కక్కుతున్న గాలి, ఉక్కపోతతో జనం అల్లాడి‌పోతున్నారు. అధిక చెమట వల్ల నీరసం రావడం, చర్మం జీవం కోల్పోవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండ తాపానికి చెక్ పేట్టే ఫుడ్ బీట్‌రూట్

బీట్‌రూట్ ఆరోగ్యానికి అమృతం.. తెలిస్తే అస్సలు వదలరు!
Summer Health Tips

ఇంటర్నెట్ డెస్క్: భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సెగలు కక్కుతున్న గాలి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అధిక చెమట వల్ల నీరసం రావడం, చర్మం జీవం కోల్పోవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేయాలి. ప్రకృతి మనకు ప్రసాదించిన అటువంటి అద్భుతమైన సూపర్ ఫుడ్‌లో బీట్‌రూట్ ఒకటి. దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి.


బీట్‌రూట్‌ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:

1. బీట్‌రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందుతాయి.

2. బీట్‌రూట్‌లో ఉండే సైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వేసవిలో వచ్చే బీపీ హెచ్చుతగ్గులను ఇది సమర్థవంతంగా అరికడుతుంది.

beerut.jpg3. ఎండ వల్ల కలిగే అలసట తగ్గించడంలో బీట్‌రూట్ బాగా పనిచేస్తుంది. వ్యాయామం చేసే వారు లేదా ఎండలో తిరిగే వారు ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

4. వేసవిలో ఎండల వల్ల చర్మం కమిలిపోతుంది. బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపునిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మొటిమల సమస్య తగ్గుతుంది.

bitrut.jpg5. వేసవిలో జీర్ణక్రియ మందగించడం సహజం. బీట్‌రూట్‌లో అధికంగా ఉండే ఫైబర్ (పీచు పదార్థం) మలబద్ధకాన్ని నివారించి, పొట్టను తేలికగా ఉంచుతుంది.

6. వేసవిలో బీట్‌రూట్‌‌లో నిమ్మరసం, కాస్త పూదీనా కలిపి జ్యూస్ చేసుకుంటే చాలా రుచిగా, చల్లగా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అలాగే, పెరుగులో తురిమిన బీట్‌రూట్ కలిపి 'బీట్‌రూట్ రైతా'గా చేసుకుంటే శరీరం చల్లబడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 03 , 2026 | 05:01 PM