Share News

వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృత పానీయాలు.. ఈ డ్రింక్స్‌తో మీ ఎనర్జీ డబుల్!

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:51 PM

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అవి ఏంటో తెలుసుకుందాం..

వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృత పానీయాలు.. ఈ డ్రింక్స్‌తో మీ ఎనర్జీ డబుల్!
Energy Boosting Drinks

ఇంటర్నెట్ డెస్క్: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. నీరసాన్ని తగ్గించి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే కొన్ని సహజ సిద్ధమైన పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. షికంజీ: ఈ రెసిపీని నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలు, పుదీనా ఆకులతో తయారు చేస్తారు. మంచి రుచితో పాటు వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుంది.

2. నిమ్మకాయ, చక్కెర, నీటితో తయారు చేసే ఈ డ్రింక్ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. కడుపు చల్లగా ఉండేలా చేస్తుంది. వేసవిలో చాలా ఎక్కువమంది తాగే పానీయం ఇది.

3. కొబ్బరినీళ్లు ఇది ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ ఎనర్జీ డ్రింక్. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరంలోని డీహైడ్రేషన్‌ను తగ్గించి తక్షణ శక్తినిస్తాయి.

4.వేసవిలో శరీరానికి చలువ చేయడానికి మజ్జిగను మించిన పానీయం లేదు. ఇందులో కొంచెం అల్లం, కొత్తిమీర, ఉప్పు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి శక్తి వస్తుంది.

5.రాగులలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. రాగి పిండిని నీళ్లలో ఉడికించి, మజ్జిగ లేదా బెల్లం కలిపి తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఎండ వేడి తట్టుకునే శక్తినిస్తుంది.

6. చెరుకు రసంలో గ్లూకోజ్ ఉంటుంది. తక్షణ శక్తి కావాలనుకున్నప్పుడు చెరుకు రసం తాగితే మంచిది. ఇది కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

7. పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇందులో ఉండే లైకోపిన్, అమినో యాసిడ్స్ అలసటను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

8. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని నిమ్మరసంలో లేదా కొబ్బరి నీళ్లలో కలిపి తాగితే శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News

Updated Date - Apr 04 , 2026 | 03:00 PM