Share News

ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగకండి.!

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:06 PM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు తాగడం చాలా అవసరం. అయితే.. ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగకండి.!
Drinking Water after Eating Fruits

ఇంటర్నెట్ డెస్క్: మన శరీరంలో సుమారు 70 శాతం నీరే ఉంటుంది. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మంచిదే.. కానీ బొప్పాయి తిన్న వెంటనే నీరు తాగితే ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు రావచ్చు. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత కనీసం 30–40 నిమిషాల గ్యాప్ తర్వాత గోరువెచ్చని నీరు తాగడం మంచిది.

శెనగలు / చిక్‌పీస్:

శెనగల్లో ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి శెనగలు తిన్న తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి.


డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ఎంజైములు బలహీనపడతాయి. దీని వల్ల కడుపు భారంగా అనిపించవచ్చు. కనీసం 30 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది.

సిట్రస్ పండ్లు :

నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. వీటి తర్వాత వెంటనే నీరు తాగితే కడుపులో గ్యాస్, అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఈ పండ్లు తిన్న తర్వాత అరగంట పాటు నీరు తాగకపోవడం మంచిది.


వేడి పాలు:

వేడి పాలు తాగిన వెంటనే నీరు తాగితే పాలలోని ప్రోటీన్లు సరిగ్గా జీర్ణం కావు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పాలు తాగిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేరుశెనగలు:

వేరుశెనగల్లో కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగించి కడుపు భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వేరుశెనగలు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు నీరు తాగకపోవడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 20 , 2026 | 07:45 PM