Share News

యువతలో పెరుగుతున్న ఆర్థరైటిస్ సమస్యలు.. కారణం ఇదేనా?

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:54 PM

యువతలో ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో చేసే కఠినమైన వ్యాయామాలు కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యువతలో పెరుగుతున్న ఆర్థరైటిస్ సమస్యలు.. కారణం ఇదేనా?
Causes of Arthritis in Youth

ఇంటర్నెట్ డెస్క్: యువతలో ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం అధిక తీవ్రతతో చేసే వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా మంది జిమ్‌లో ఎక్కువగా కఠినమైన వ్యాయామాలు చేస్తారు. కానీ ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెంచి, భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.


వ్యాయామం మితిమీరితే ప్రమాదం

ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్, తేలికపాటి వ్యాయామాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ మితిమీరిన వ్యాయామం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. క్రాస్‌ఫిట్‌, హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ వంటి కఠినమైన ఫిట్‌నెస్ ట్రెండ్స్.. మోకాళ్లు, తుంటి, వెన్ను వంటి భాగాలపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల గాయాలు, కీళ్ల సమస్యలు, చివరికి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

yoga (1).jpg


ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

ఆర్థరైటిస్ అనేది కీళ్లలో ఉన్న మృదులాస్థి (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధి. కీళ్ల నొప్పి, వాపు, కదలికలో ఇబ్బంది దీని లక్షణాలు. ఇది ఎక్కువగా మోకాళ్లు, చేతులు, వెన్నెముకపై ప్రభావం చూపుతుంది.

యువతలో ఎందుకు పెరుగుతోంది?

  • అధిక వ్యాయామం

  • కీళ్లపై పదేపదే ఒత్తిడి

  • ఊబకాయం

  • గాయాలు

  • వ్యాయామం సరిగా చేయకపోవడం

ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


జాగ్రత్తలు

  • తీవ్రతతో కూడిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

  • ట్రైనర్ పర్యవేక్షణలోనే జిమ్ చేయాలి.

  • కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

  • ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గించాలి.

  • శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Updated Date - Mar 18 , 2026 | 02:56 PM