Share News

ఫుడ్ డెలివరీ ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం హానికరమా?

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:37 PM

హోటల్ నుంచి వచ్చే ఫుడ్ ఎక్కువగా నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లలోనే అందుతుంది. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్లాస్టిక్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఫుడ్ డెలివరీ ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం హానికరమా?
Food Delivery Plastic Health Risks

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఫుడ్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో నల్లటి ప్లాస్టిక్ కంటైనర్ల వినియోగం కూడా అధికమైంది. హోటళ్ల నుంచి వచ్చే బిర్యానీ, కర్రీలు, ఇతర వంటకాలు ఎక్కువగా ఈ నల్లటి ప్లాస్టిక్ డబ్బాల్లోనే వస్తుంటాయి. ఇవి ఆకర్షణీయంగా కనిపించడంతో చాలా మంది వాటిని శుభ్రం చేసి ఇంట్లో మళ్లీ వాడుతున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నిపుణుల ప్రకారం, నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లు ఎక్కువగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారవుతాయి. ఈ వ్యర్థాల్లో పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, PVC పదార్థాలు, ఇతర పరిశ్రమల ప్లాస్టిక్ అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఈ పదార్థాల మిశ్రమాన్ని దాచేందుకు నల్ల రంగును ఉపయోగిస్తారు.

Food (1).jpg


వేడి ఆహారంతో ప్రమాదం ఎక్కువ..

నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి, నూనె లేదా పులుపు ఉన్న వంటకాలను ఉంచినప్పుడు ప్లాస్టిక్ నుంచి హానికరమైన రసాయనాలు ఆహారంలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మైక్రోవేవ్‌లో ఈ కంటైనర్లను వేడి చేస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ రసాయనాలు శరీరంలోకి చేరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


మైక్రో ప్లాస్టిక్ ప్రభావం కూడా ఉండొచ్చు..

చాలా చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాలు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఇవి హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

ఫుడ్ డెలివరీ వచ్చిన వెంటనే ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్ నుంచి తీసి స్టీల్ లేదా గాజు పాత్రల్లోకి మార్చడం ఉత్తమం. అలాగే నల్లటి ప్లాస్టిక్ డబ్బాలను మైక్రోవేవ్‌లో ఉపయోగించకుండా ఉండాలి. ప్లాస్టిక్ కంటైనర్ల వినియోగాన్ని తగ్గించడం ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షితమైన పదార్థాలతో తయారైన పాత్రలను ఉపయోగించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?

పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

For More Latest News

Updated Date - Feb 21 , 2026 | 04:45 PM