Joint Pains: కీళ్ల ఆరోగ్యానికి మేలు చేసే బెస్ట్ ఆహార పదార్థాలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:04 PM
ఒకప్పుడు వృద్ధాప్యంలో వ్యక్తులకు కీళ్ల నొప్పులు వచ్చేవి.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్లకి కూడా కీళ్ల నొప్పులు కామన్‌గా మారాయి.
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో(Joint Pains) బాధపడుతున్నారు. చాలా వరకు శారీరక శ్రమ లేకపోవడం, తినే ఆహార పదార్ధాల వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కీళ్ల నొప్పులు తగ్గడానికి కేవలం మందులు మాత్రమే కాకుండ, సరైన ఆహారం కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో మంటను (Inflammation) తగ్గించే ఆహారపదార్ధాలను తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
చేపలు: సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాడిస్స్ కీళ్ల వాతాన్ని తగ్గిస్తాయి.
వాల్‌నట్స్, సీడ్స్: వాల్‌నట్స్ (Walnuts), అవిసె గింజలు(Flax seeds), చియా సీడ్స్‌లో ఉండే పోషకాలు కీళ్ల నొప్పులను అరికడతాయి.
పసుపు: ఇందులో ఉండే ‘కర్కుమిన్’ కీళ్ల వాతాన్ని తగ్గించడంలో సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. పాలలో చిటికెడ్ పసుపు వేసుకొని తాగితే చాలా మంచిది.
అల్లం: కీళ్ల వాపులను తగ్గించడమే కాకుండా.. నొప్పిని అదుపులో ఉంచుతుంది. అల్లంతో చేసే కషాయం తాగితే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కీళ్ల వాతం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్: నిమ్మ, నారింజ వంటి పండ్లలో విటమిన్ - సి అధికంగా ఉంటుంది. ఈ పండ్లు కీళ్లలోని కొల్లాజెన్‌ను రక్షించడంలో సహాపడతాయి.
ఆకుకూలు: పాలకూల వంటి ఆకుకూరల్లో విటమిన్-ఇ, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాపడుతుంది.
ఆలీవ్ ఆయిల్: ఇందులో ఉండే ‘ఓలియోకాంతల్’ అనే పదార్థం నొప్పి నివారణకు పనిచేస్తుంది.
గ్రీన్ టీ: ఇది శరీరంలోని మంటను తగ్గించి, కీళ్ల అరుగుదలను నిరోధిస్తుంది.