Share News

కలబంద జ్యూస్ తాగుతున్నారా? ప్రయోజనాల మాటేమో కానీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:58 PM

ఈ మధ్య కాలంలో కొందరు పరగడుపున అలోవెరా (కలబంద) జ్యూస్‌ తాగుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని, చర్మ ఆరోగ్యానికీ మేలు చేస్తుందని విశ్వసిస్తున్నారు.

కలబంద జ్యూస్ తాగుతున్నారా? ప్రయోజనాల మాటేమో కానీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో కొందరు పరగడుపున అలోవెరా (కలబంద) జ్యూస్‌ తాగుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, మలబద్ధకాన్ని తగ్గిస్తుందని, చర్మ ఆరోగ్యానికీ మేలు చేస్తుందని విశ్వసిస్తున్నారు. అయితే ఖాళీ కడుపుతో దీన్ని తాగడం నిజంగా మంచిదేనా? అలోవెరా జ్యూస్‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దీన్ని తాగే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.


జీర్ణక్రియకు ఎంత మేలు?

అలోవెరాలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న కొన్ని సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో తోడ్పడవచ్చు. అలాగే ఇందులోని కొన్ని పదార్థాలు మలవిసర్జన ప్రక్రియను సులభతరం చేయగలవు. అయితే అలోవెరా జ్యూస్‌లో ఉండే అలోయిన్ అనే పదార్థం విరేచనాలకు కారణమవుతుంది. అందువల్ల మలబద్ధకం తగ్గించుకోవడానికి వైద్యుల సలహా లేకుండా దీన్ని ఉపయోగించడం మంచిది కాదు.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందా?

అలోవెరా జ్యూస్ తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందనే ప్రచారం ఉంది. అయితే దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. బరువు నియంత్రణకు సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర కీలకం. అలోవెరా జ్యూస్‌ను బరువు తగ్గించే పానీయంగా భావించకూడదు.

ఈ దుష్ప్రభావాల పట్ల జాగ్రత్త!

అలోవెరా జ్యూస్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు, ఖనిజ లవణాల స్థాయి తగ్గే ప్రమాదమూ ఉంది. రక్తంలో చక్కెర స్థాయిపైనా ఇది ప్రభావం చూపవచ్చు. మధుమేహానికి మందులు వాడేవారు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా దీన్ని తీసుకోకూడదు. గర్భిణులు, బాలింతలు అలోవెరా జ్యూస్‌కు దూరంగా ఉండటం మంచిది. అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి తప్పనిసరేమీ కాదు. దాని వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని భావించినప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు.


ఇవీ చదవండి

భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు

తింటే కివీ.. ప్రయోజనాలు ఇవి.. చిన్న పండులో ఇన్ని పోషకాలా..!

Updated Date - Oct 31 , 2026 | 09:58 PM