ఎన్డీఏ, దళపతి విజయ్‌కి శుభాకాంక్షలు: నటసింహం బాలకృష్ణ
ABN , Publish Date - May 04 , 2026 | 08:07 PM
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి పార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో గెలుపొందిన విజయ్‌కి అభినందనలు తెలియజేశారు.
అమరావతి: పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం స్పందించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోనే నూతన భారత నిర్మాణం సాధ్యం అవుతుందని అన్నారు. ఈ ఘన విజయాన్ని సాధించిన ఎన్డీఏ కూటమికి విజయాభినందనలు తెలియజేశారు.
మరోవైపు తమిళనాడు ఎన్నికల ఫలితాలపై బాలయ్య స్పందిస్తూ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావును స్మరించుకున్నారు. నటుడు తలచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ నిరూపించారని గుర్తు చేశారు. మళ్లీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకు తెచ్చిన సోదరుడు విజయ్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నటసింహం బాలకృష్ణ అభిలషించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పినరయి విజయన్ గెలుపు.. తగ్గిన ఆధిక్యం
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ