ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోదీ
ABN , Publish Date - May 04 , 2026 | 06:40 PM
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పార్టీ కార్యకర్తల కఠోర శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి విజయం ఖరారైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను అభినందించారు. వారి కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయం కోసం రాష్ట్రంలో పార్టీకి చెందిన కొన్ని తరాల కార్యకర్తలు నిరంతరం శ్రమించారని ప్రశంసించారు. కొన్నేళ్ల పాటు క్లిష్ట పరిస్థితుల్లో పోరాడారని అన్నారు. కార్యకర్తలే పార్టీ శక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్తకూ తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
బీజేపీకి మర్చిపోలేని విజయం అందించినందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కూడా ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశలను, కలలను సాకారం చేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అవకాశాలు, గౌరవం దక్కేలా పాలన అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురుn