టీవీకే అధినేత విజయ్‌కి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - May 04 , 2026 | 09:24 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత, దళపతి విజయ్ గెలుపొందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దళపతి విజయం సాధించడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత, దళపతి విజయ్ గెలుపొందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దళపతి విజయం సాధించడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తమిళ ప్రజలకు సేవ చేసే దిశగా విజయ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చంద్రబాబు కోరారు.
'తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్‌కు లభించిన అద్భుత విజయం పట్ల వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడు ప్రజలకు సేవ చేసేందుకు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఆ రాష్ట్ర ప్రజల పురోగతి, శ్రేయస్సుకు అర్థవంతంగా తోడ్పడేందుకు విజయ్ చేస్తున్న కృషికి సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ