గుడ్ న్యూస్.. VITEEE-2026 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:36 PM
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించే VITEEE-2026 పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం అప్లికేషన్ దాఖలు చివరి తేదీని విట్ యాజమాన్యం పొడిగించింది.
ఇంటర్నెట్ డెస్క్: వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Vellore Institute of Technology) నిర్వహించే VITEEE-2026 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం అప్లికేషన్ దాఖలు చివరి తేదీని విట్ యాజమాన్యం పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం.. అభ్యర్థులు 2026 బ్యాచ్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారమ్‌ను 2026 ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పరీక్షను ఏప్రిల్ 28 నుంచి మే 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందని.. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే VITEEE-2026 పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది.
పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలంటే..
మెుదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి
అప్లికేషన్ నంబర్ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలి
వ్యక్తిగత, విద్యా వివరాలు, పరీక్ష కేంద్రం ఎంపిక చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి
ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి
చివరగా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి
ఫీజు వివరాలు..
VITEEE-2026 అప్లికేషన్ ఫీజు రూ.1350గా విట్ కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఫీజు అన్ని వర్గాల విద్యార్థులకూ ఒకేలా ఉంటుందని, ఎలాంటి రీఫండ్స్ ఉండవని తెలిపింది.
రిజిస్ట్రేషన్ తర్వాత..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులు విట్ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇది 2026 ఏప్రిల్ మొదటి వారం నుంచి అందుబాటులో ఉండే అవకాశముంది. మాక్ టెస్ట్ ద్వారా విద్యార్థులు ప్రశ్నాపత్రం నమూనా, పేపర్ క్లిష్టత తీరు, మార్కింగ్ విధానం వంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో అడ్మిట్ కార్డులు పొందేందుకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్ష తేదీ, టైమ్ స్లాట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్
నీట్ పదునైన వ్యూహంతో పక్కా ఫలితం సాధ్యం