పరిశోధకులకు మంచి ఛాన్స్.. ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:30 AM
పరిశోధకులకు టెక్ దిగ్గజం ఓపెన్ఏఐ శుభవార్త చెప్పింది. అర్హులైన రీసెర్చర్లకు ‘చాట్‌జీపీటీ ప్లస్’ సేవలను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: పరిశోధన రంగంలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేసేందుకు చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఓపెన్ఏఐ సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత్‌లో అర్హులైన పరిశోధకులకు ‘చాట్‌జీపీటీ ప్లస్’ సేవలను సంవత్సరకాలం పాటు ఉచితంగా అందించాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు అధికార ప్రకటనను విడుదల చేసిందా సంస్థ. ఈ నిర్ణయం ద్వారా భారత్ సహా ఇతర దేశాలకు చెందిన 200,000 మంది రీసెర్చర్లు ఫ్రీగా ‘చాట్‌జీపీటీ ప్లస్’ సదుపాయాన్ని పొందనున్నారు. నవంబర్ 30 నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుందని ఓపెన్ఏఐ తెలిపింది. అర్హత కలిగిన పరిశోధకులు అప్లై చేసుకోవాలని సూచించింది. ఇంతకీ దీనికి ఎవరెవరు అర్హులో తెలుసా..?
అర్హులు వీరే..
ఉన్నత పరిశోధనలు నిర్వహించే వారి కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది ఓపెన్ఏఐ. సైన్స్, గణితం, ఇంజినీరంగ్ విభాగాల్లోని రీసెర్చర్లు దీనికి అర్హులు. దరఖాస్తు చేసేవారు తమకున్న సంస్థాగత అనుబంధం, పరిశోధన అనుభవాలను కచ్చితంగా పేర్కొనాలి. arXiv, bioRxiv, ChemRxiv లాంటి ప్లాట్‌ఫామ్‌లలో దరఖాస్తుదారుల పరిశోధనలకు సంబంధించిన పత్రాలు ఇప్పటికే ప్రచురితమై ఉండాలి. అలాగే తమ రీసెర్చ్ గురించి వారు అన్ని విషయాలూ వెల్లడించాలి. చాట్‌జీపీటీని పరిశోధన కోసం ఎలా వినియోగిస్తారో పూసగుచ్చినట్టుగా వివరించాలి. ఈ నెల 30 నుంచి ఓపెన్ఏఐ దరఖాస్తులను స్వీకరించనుంది. ఎంపికైన వారికి 12 నెలల పాటు ఉచితంగా ‘చాట్‌జీపీటీ ప్లస్’ అందించనుంది. మరిన్ని వివరాల కోసం ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇవీ చదవండి
ప్రపంచ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మారింది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
స్థానిక ఉగ్రవాదుల నుంచి కశ్మీర్‌కు విముక్తి.. అమిత్ షా వ్యాఖ్యలు