Share News

SBIలో లక్షల వేతనంతో ఉద్యోగావకాశం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:42 PM

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SBIలో లక్షల వేతనంతో ఉద్యోగావకాశం
SBI PO Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ నిర్మించాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,500 పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎస్‌బీఐలో పీవోగా ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతనంతో పాటు పలు అలవెన్సులు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మహానగరాల్లో పనిచేసే అధికారులకు వార్షికంగా సుమారు రూ.22 లక్షల వరకు మొత్తం వేతన ప్యాకేజీ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, పదోన్నతులు, విదేశీ శాఖల్లో పనిచేసే అవకాశాలు కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

అభ్యర్థుల ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష, చివరగా సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


ప్రిలిమినరీ పరీక్ష

ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది.

మెయిన్స్ పరీక్ష

మెయిన్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు భాగాలు ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, జనరల్ అవేర్‌నెస్, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ విభాగంలో ఈమెయిల్ రచన, రిపోర్ట్ రైటింగ్ వంటి అంశాలు ఉంటాయి.

తుది ఎంపిక

మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కులు, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాలు సేవలందిస్తామని అంగీకార పత్రం సమర్పించాల్సి ఉంటుంది.


అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

  • 2026 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

  • రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.750

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జులై 8

  • ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టులో ఉండే అవకాశం

  • మెయిన్స్ పరీక్ష: సెప్టెంబర్

  • గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలు: అక్టోబర్ లేదా నవంబర్

బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధమవడం అవసరం.


Also Read:

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Updated Date - Jun 22 , 2026 | 07:00 PM