Share News

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు.. మిస్ అవ్వకండి

ABN , Publish Date - Jul 12 , 2026 | 10:23 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)లో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు..  మిస్ అవ్వకండి
ISRO Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగం చేయాలని ఆశించే అభ్యర్థులకు శుభవార్త. ఇస్రోకు చెందిన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC), బెంగళూరులో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జులై 20, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


ఖాళీల వివరాలు

  • టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్స్ మెకానిక్/సివిల్/మెకానికల్) – 9 పోస్టులు

  • టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) – 7 పోస్టులు

  • సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్) – 5 పోస్టులు

  • లైబ్రరీ అసిస్టెంట్-ఏ – 1 పోస్టు

  • కుక్-ఏ – 2 పోస్టులు

  • డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి – 2 పోస్టులు

విద్యార్హతలు

పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ వంటి అర్హతలు ఉండాలి. కుక్ పోస్టులకు ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి.


జీతభత్యాలు

  • టెక్నీషియన్-బి – నెలకు రూ.21,700 + అలవెన్సులు

  • టెక్నికల్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్ / లైబ్రరీ అసిస్టెంట్ – నెలకు రూ.44,900 + అలవెన్సులు

  • కుక్-ఏ – నెలకు రూ.19,900 + అలవెన్సులు

వయోపరిమితి

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

  • టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు – రూ.250

  • టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, కుక్ పోస్టులకు – రూ.100

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీ

  • దరఖాస్తుకు చివరి తేదీ: జులై 20, 2026

అర్హత ఉన్న అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, గడువు తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


Also Read:

ఆషాఢ వేళ... మెహందీ కళ!

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 12 , 2026 | 10:23 AM