Share News

ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:06 AM

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే యువకులకు శుభవార్త. ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కింద గ్రూప్-‘Y’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఎయిర్ ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి
Indian Air Force Recruitment

ఇంటర్నెట్ డెస్క్: రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత వాయుసేన (Indian Air Force) ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కింద గ్రూప్-‘వై’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు జులై 26, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


పోస్టు పేరు

గ్రూప్-‘Y’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ (Airmen Intake 02/2027)

విద్యార్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

  • 10+2 / ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా ఇదే సబ్జెక్టులతో రెండేళ్ల వృత్తి విద్య (Vocational Course) పూర్తి చేసి ఉండాలి.

  • లేదా డిప్లొమా ఫార్మసీ, బీ.ఫార్మసీ లేదా బీఎస్సీ (ఫార్మసీ) పూర్తి చేసి, నియామక సమయానికి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.


వయోపరిమితి

ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేసుకునేవారు:

  • 1 జులై 2006 నుంచి 1 జులై 2010 మధ్య జన్మించి ఉండాలి.

డిప్లొమా/బీ.ఫార్మా/బీఎస్సీ (ఫార్మసీ) అభ్యర్థులు:

  • అవివాహితులు: 1 జులై 2003 నుంచి 1 జులై 2008 మధ్య జన్మించి ఉండాలి.

  • వివాహితులు: 1 జులై 2003 నుంచి 1 జులై 2006 మధ్య జన్మించి ఉండాలి.

వేతనం

  • శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ అందుతుంది.

  • శిక్షణ పూర్తైన తర్వాత ప్రారంభ వేతనం రూ.26,900తో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.


ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను మూడు దశల్లో నిర్వహిస్తారు.

  • ఫేజ్-1: ఆన్‌లైన్ రాత పరీక్ష

  • ఫేజ్-2: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PET), అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, సర్టిఫికేట్ వెరిఫికేషన్

  • ఫేజ్-3: వైద్య పరీక్షలు, తుది మెరిట్ జాబితా

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.550 + జీఎస్‌టీ చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేదీ: 26 జులై 2026

  • ఆన్‌లైన్ పరీక్షలు: 22, 23 సెప్టెంబర్ 2026

  • ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్: మే 2027 చివరి వారం

  • ఎన్‌రోల్‌మెంట్ లిస్ట్ విడుదల: 1 జూన్ 2027

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు భారత వాయుసేన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, వయోపరిమితి, అవసరమైన పత్రాలను ఒకసారి తప్పకుండా పరిశీలించడం మంచిది.


Also Read:

ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..

Updated Date - Jul 10 , 2026 | 11:14 AM