ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..
ABN , Publish Date - Jul 07 , 2026 | 10:46 AM
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు జులై 10, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హీమోగ్లోబినోపతీస్ సంస్థలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 10, 2026.
ఖాళీల వివరాలు
సైంటిస్ట్-సి (నాన్-మెడికల్) – 1 పోస్టు
సైంటిస్ట్-బి (మెడికల్) – 2 పోస్టులు
సైంటిస్ట్-బి (నాన్-మెడికల్) – 3 పోస్టులు
విద్యార్హతలు
సైంటిస్ట్-సి (నాన్-మెడికల్):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా UGC/PCI గుర్తింపు పొందిన ఫార్మ్-డి అర్హత ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి.
సైంటిస్ట్-బి (మెడికల్):
MCI/NMC గుర్తింపు పొందిన సంస్థ నుంచి MBBS లేదా దానికి సమానమైన వైద్య డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సైంటిస్ట్-బి (నాన్-మెడికల్):
బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా UGC/PCI గుర్తింపు పొందిన ఫార్మ్-డి అర్హత ఉండాలి. ఈ పోస్టులకు అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి
సైంటిస్ట్-బి పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
సైంటిస్ట్-సి పోస్టుకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతభత్యాలు
సైంటిస్ట్-సి (లెవల్-11): నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు.
సైంటిస్ట్-బి (లెవల్-10): నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు.
ఎంపిక విధానం
అభ్యర్థులను ముందుగా విద్యార్హతలు, అనుభవం, వయస్సు తదితర అంశాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ లేదా రెండింటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించేందుకు కనీసం 75 శాతం మార్కులు అవసరం.
దరఖాస్తు ఫీజు
సాధారణ అభ్యర్థులు – రూ.1,500
SC, ST, మహిళలు, PwBD, EWS అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం
ICMR అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోవడం మంచిది.
అవసరమైన పత్రాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
సంతకం
పదో తరగతి సర్టిఫికెట్ (వయస్సు ధ్రువీకరణ కోసం)
విద్యార్హతల మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
అనుభవ ధ్రువీకరణ పత్రాలు (వర్తిస్తే)
ముఖ్యమైన తేదీ
దరఖాస్తు చివరి తేదీ: జులై 10, 2026
నోటిఫికేషన్ & దరఖాస్తు
ICMR అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో నోటిఫికేషన్‌ను పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:
యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?
తేనె స్వచ్ఛమైనదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి