IBPS క్లర్క్ నోటిఫికేషన్ విడుదల.. 11 వేలకుపైగా పోస్టులు
ABN , Publish Date - Aug 03 , 2026 | 07:20 PM
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ స్థాయి ఉద్యోగాల భర్తీకి IBPS క్లర్క్ (CRP CSA-XVI) 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు, తెలంగాణలో 191 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
పోస్టు పేరు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్)
మొత్తం ఖాళీలు: 11,403
రాష్ట్రాల వారీగా ఉన్న ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ – 186
తెలంగాణ – 191
ఉత్తరప్రదేశ్ – 1,731
కర్ణాటక – 1,414
మహారాష్ట్ర – 1,051
పశ్చిమ బెంగాల్ – 946
తమిళనాడు – 675
గుజరాత్ – 698
మధ్యప్రదేశ్ – 570
ఢిల్లీ – 415
కేరళ – 108
గోవా – 61
విద్యార్హతలు
IBPS క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అలాగే 2026 ఆగస్టు 21 నాటికి విద్యార్హత పూర్తి అయి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వంటి నైపుణ్యాలు అవసరం.
వయోపరిమితి
2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు:
కనిష్టం: 20 సంవత్సరాలు
గరిష్ఠం: 28 సంవత్సరాలు
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
IBPS క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు:
బేసిక్ పే: రూ.24,050 నుంచి రూ.64,480 వరకు
బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు: రూ.175
ఇతర అభ్యర్థులు: రూ.850
ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.
పరీక్ష విధానం
IBPS క్లర్క్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి.
ప్రిలిమ్స్ పరీక్ష
మొత్తం మార్కులు: 100
వ్యవధి: 60 నిమిషాలు
విభాగాలు:
ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు
న్యూమరికల్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు
రీజనింగ్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు
మెయిన్స్ పరీక్ష
మొత్తం మార్కులు: 200
వ్యవధి: 125 నిమిషాలు
విభాగాలు:
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్
జనరల్ ఇంగ్లీష్
రీజనింగ్ ఎబిలిటీ
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులను ఈ దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:
ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష
మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్ష
లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LLPT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 1, 2026
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 21, 2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 21, 2026
ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 2026
ప్రిలిమ్స్ ఫలితాలు: నవంబర్ 2026
మెయిన్స్ పరీక్ష: డిసెంబర్ 2026
తాత్కాలిక కేటాయింపు: మార్చి 2027
దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అభ్యర్థులు ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలు తాత్కాలికమైనవని, బ్యాంకుల అవసరాలను బట్టి మారే అవకాశం ఉందని IBPS తెలిపింది.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఈ నియామక ప్రక్రియ మంచి అవకాశంగా మారనుంది.
ALso Read:
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
మంత్రి సుభాశ్ చొరవ.. ఆ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స