జాబ్ కార్నర్ 2-11-2026
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:40 AM
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) - నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్(ఎన్‌టీసీ) - గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వేలోని...
జాబ్ కార్నర్
ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) - నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్(ఎన్‌టీసీ) - గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వేలోని వివిధ జోన్లలో 3548 పోస్టుల కోసం ఈ ప్రకటనను ఉద్దేశించారు.
పోస్టులు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్- 127, గూడ్స్ ట్రైన్ మేనేజర్-2750, జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్-300, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-371
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: రెండు దశల్లో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఆఖరు తేదీ: నవంబర్ 6
స్టేషన్ మాస్టర్స్
1215 స్టేషన్ మాస్టర్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రెండు దశల్లో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 25
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in
నార్ట్ వెస్ట్రన్ రైల్వే(జైపూర్) రెండు వేలకు పైగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆజ్మీర్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్‌ల్లోని రైల్వే కార్యాలయాలు, వర్క్‌షాపుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ట్రేడ్‌లు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేషన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతకు తోడు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ సర్టిఫికెట్ ఉండాలి.
ఎంపిక: టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 6
వెబ్‌సైట్: www.rrcjaipur.in
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..