ఎన్ఐడి అడ్మిషన్లు 2027 డిజైన్ కోర్సులు పీజీ ఇంటిగ్రేటెడ్ పీజీ పీహెచ్‌డీ దరఖాస్తు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:47 AM
ఒక వస్తువుకు ఉండాల్సిన సాధారణ లక్షణాలు దెబ్బతినకుండా అందంగా, ఆధునికంగా మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడాన్నే డిజైనింగ్ అంటాం. దీనికి సంబంధించి మన...
ఎన్‌ఐడీ
ఒక వస్తువుకు ఉండాల్సిన సాధారణ లక్షణాలు దెబ్బతినకుండా అందంగా, ఆధునికంగా మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడాన్నే డిజైనింగ్ అంటాం. దీనికి సంబంధించి మన దేశంలో అత్యున్నత శిక్షణ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) అహ్మదాబాద్. దానికితోడు గాంధీనగర్‌లో పీజీ క్యాంపస్, బెంగళూరులో ఆర్ అండ్ డి క్యాంపస్ ఏర్పాటు చేశారు. తరవాతి రోజుల్లో విజయవాడ(ఆంధ్రప్రదేశ్), కురుక్షేత్ర(హర్యానా), భోపాల్(మధ్యప్రదేశ్), జోర్హాట్(అసోం)లలో కూడా ఎన్‌ఐడిలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఇవి దరఖాస్తులను కోరుతున్నాయి.
అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, మధ్యప్రదేశ్, హర్యానా క్యాంపస్‌లు పీజీ కోర్సును అందిస్తున్నాయి.
అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు అలాగే ఏపీ, హర్యానా మధ్యప్రదేశ్, అసోం క్యాంపస్‌లు అయిదున్నరేళ్ళ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి.
అహ్మదాబాద్ క్యాంపస్‌లో పీహెచ్‌డీని ఆరు ఏరియాల్లో అందిస్తున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30
డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్: డిసెంబర్ 20
వెబ్‌సైట్: https://admsions.nid.edu/
NIDA2027/Default.aspx
హెల్త్‌లో పీజీ
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి బొల్లినేని మెడ్‌స్కిల్స్ అందిస్తున్న కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది.
రెండేళ్ళ కాలవ్యవధి కలిగిన మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. 40 సీట్లు ఉన్నాయి.
ఏడాది కాలవ్యవధి కలిగిన మరో మూడు కోర్సులు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి బీఎస్సీ, ఫార్మసీకి తోడు ఎంబీబీఎస్ సహా వివిధ మెడికల్ కోర్సుల ఉత్తీర్ణులు అర్హులు. ఒక్కో కోర్సులో 15 సీట్లు ఉన్నాయి.
పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 15లోగా పంపుకోవాలి. మరిన్ని వివరాలకు 7995013421/7207953919 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
వెబ్‌సైట్: www.audoa.andhrauniversity.edu.in
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..