Share News

ఏపీ అసెంబ్లీలో రిపోర్టర్ పోస్టులు.. రూ.1,47,760 వరకు జీతం

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:52 AM

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లీష్ రిపోర్టర్స్, తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

ఏపీ అసెంబ్లీలో రిపోర్టర్ పోస్టులు.. రూ.1,47,760 వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీసెస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఇంగ్లీష్ రిపోర్టర్స్, తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు..

1. ఇంగ్లీష్ రిపోర్టర్స్: 10

2. తెలుగు రిపోర్టర్స్: 01

మొత్తం ఖాళీల సంఖ్య: 11

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్/ తెలుగు షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్‌లలో హైయర్ గ్రేడ్ పాసై ఉండాలి. తెలుగు షార్ట్‌హ్యాండ్‌లో 80 wpm ప్రాక్టికల్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలి.

ప్రాధాన్యత: ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ పాస్ కావాలి.

జీతం: రూ.57,100 నుంచి రూ1,47,760.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: నవంబర్ 2.

null

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. రూ.1,15,500 వరకు జీతం

ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. రూ.1.36 లక్షల వరకు జీతం

Updated Date - Oct 06 , 2026 | 09:12 AM