ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. రూ.1.36 లక్షల వరకు జీతం
ABN , Publish Date - Oct 04 , 2026 | 08:27 AM
రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులు చేసుకునేందుకు ఆఖరి తేదీ అక్టోబర్ 26.
పోస్టుల వివరాలు..
సివిల్ జడ్జి ( జూనియర్ డివిజన్): 119 పోస్టులు
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హైకోర్టు సర్వీస్, డిస్ట్రిక్ట్ జ్యుడీషియర్, ప్రొసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ఇతర ప్రభుత్వ శాఖల్లో సభ్యుడిగా పనిచేస్తూ ఉండాలి.
వయోపరిమితి: 01-09-2026 నాటికి 35 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520.
ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది.
1.స్క్రీనింగ్ టెస్ట్: కంప్యూటర్ ఆధారిత- 100 మార్కులు (మల్లిపుల్ ఛాయిస్ ప్రశ్నలు). ఇందులో 40 శాతం మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
2. రాత పరీక్ష: మొత్తం 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1: సివిల్ లాస్, పేపర్ 2: క్రిమినల్ లాస్, పేపర్ 3: ఇంగ్లీష్ (అనువాదం, వ్యాస రచన).
3. ఇంటర్వ్యూ: 50 మార్కులు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.750.
దరఖాస్తు చివరి తేదీ: 26.10.2026.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. నెలకు రూ.16,650 స్టైపెండ్!