ఏపీలో విద్యాహక్కు చట్టం అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:41 PM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం(RTE) సెక్షన్ 12(1)(c) అమలు, మార్గదర్శకాల సమీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం(RTE) సెక్షన్ 12(1)(c) అమలు, మార్గదర్శకాల సమీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ద్వారా G.O.RT.141ను ప్రభుత్వం జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన ఈ రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు కమిటీ సభ్య కార్యదర్శి(కన్వీనర్)గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
సుప్రీంకోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త నిబంధనలను రూపొందించే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించడం, ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫిర్యాదుల పరిష్కారానికి స్పష్టమైన విధివిధానాలను రూపొందించనుంది. విద్యాహక్కు చట్టం అమలులో రాష్ట్రంలో ఎదురవుతున్న న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను కూడా కమిటీ పరిశీలించనుంది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన అనంతరం కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.
ఇవి కూడా చదవండి...
విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని
కొత్త పింఛన్లు, స్థానిక ఎన్నికలు.. మంత్రులతో లోకేశ్ కీలక చర్చ
Read Latest AP News And Telugu News