10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:33 AM
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.
అమరావతి: 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 82.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 94,990 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు.
గత ఏడాది నమోదైన 76.14 శాతం ఉత్తీర్ణతతో పోలిస్తే ఈసారి 6.25 శాతం మెరుగుపడటం విశేషమని లోకేశ్ పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల అనంతరం ప్రభుత్వం ప్రత్యేక విద్యా మద్దతు, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించిందని తెలిపారు. విద్యార్థుల కోసం అమలు చేసిన 20 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
Also Read:
కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు
కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి