Share News

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా..

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:36 PM

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. సీబీఎస్సీ రివైజ్డ్ ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక రిజల్ట్ విడుదల చేయాలని నిర్ణయించింది.

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు వాయిదా..
AP EAPCET 2026 Results Postponed

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2026 (AP EAPCET 2026) ఫలితాల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా, ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉండటంతో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్సీ రివైజ్డ్ ఫలితాలు, అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.


ఈ ఏడాది మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజా నిర్ణయం ప్రకారం జులై 2 వరకు ఈఏపీసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది.


Also Read:

‘జడ్జి ఏ ఆర్డర్ అయినా పాస్ చేసుకోమనండి’.. లాయర్ వ్యాఖ్యలు వైరల్

ప్రధాని మోదీకి ఫోన్ చెయ్.. అమెరికా రాయబారి సర్జియో గోర్‌తో డోనాల్డ్ ట్రంప్..

Updated Date - Jun 30 , 2026 | 01:36 PM