Share News

సంక్షోభ సమయంలో పొదుపు అవసరమే

ABN , Publish Date - May 22 , 2026 | 01:01 AM

పశ్చిమాసియా యుద్ధ‌‌ సంక్షోభం వల్ల చమురు కొరత ఏర్పడి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చమురు వినియోగం తగ్గించే చర్యలు చేపట్టాయి. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ఇంధన వాడకం...

సంక్షోభ సమయంలో పొదుపు అవసరమే

పశ్చిమాసియా యుద్ధ‌‌ సంక్షోభం వల్ల చమురు కొరత ఏర్పడి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చమురు వినియోగం తగ్గించే చర్యలు చేపట్టాయి. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ఇంధన వాడకం తగ్గించటం మంచిదే. మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ బాధ్యతగా అనవసర, ఆర్భాట‌ ఖర్చులకు దూరంగా వుండి‌ ప్రజలకు మార్గదర్శంగా నిలవాలి. ఇక నుంచి దేశీయంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఇథనాల్, బయో‌గ్యాస్, గోబర్ గ్యాస్ ప్లాంట్ల వంటివి ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసి, వాటి వాడకం పెంచి సాధ్యమైనంత వరకు విదేశీ చమురు దిగుమతుల్ని తగ్గించాలి‌. ఎరువుల దిగుమతులు కూడ తగ్గి రైతుల‌ వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వలె గ్రామీణ ప్రాంతాల్లో నివసించాలని కోరుకునే వారికి గృహ నిర్మాణాలకి ఆర్థిక సాయం అందిస్తే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెంది, పట్టణ ప్రాంతాల ట్రాఫిక్ రద్దీలు తగ్గుతాయి. చమురు ధరలని తరచుగా పెంచుతుంటే నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం కూడ‌ పెరుగుతూ సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎందరో బిలియనీర్లు తమకు తామే కోరుతున్న విధంగా కేంద్ర ప్రభుత్వం వారిపై సంపద, వారసత్వ పన్నులు విధించి తీవ్రంగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, అవినీతి, అక్రమాలు కట్టడి చేయాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కూడ దుబారా ఖర్చులు తగ్గించి, పొదుపు చేయాలి. అల్ప జనాభా గల హాలెండ్,‌ నార్వే ధనిక దేశాల్లో మంత్రులు, అధికారులు సైతం పర్యావరణం, ఆరోగ్య పరిరక్షణ కోసం తరచు‌‌ సైకిళ్ళు వాడతారట. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

తిరుమలశెట్టి సాంబశివరావు

ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 01:01 AM