మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:43 AM
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యేకంగా నగదు రహిత ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే రీతిలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు...
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రత్యేకంగా నగదు రహిత ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే రీతిలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాం. ప్రస్తుతం 40వేల రూపాయల చెల్లింపుతో జీవితాంతం భార్యాభర్తలు ఇరువురికి కలిపి 8లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కొన్ని దీర్ఘకాల వ్యాధులకూ ఉచితంగానే వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ, నానాటికీ పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, కొత్తగా పుట్టుకొస్తున్న రోగాలకు ఈ ఎనిమిది లక్షలు సరిపోవడం లేదు. చాలీచాలని పెన్షన్‌తో, వయోభారంలో రోగాలకు సరైన వైద్యం చేయించుకోలేక బతుకీడుస్తున్నాం. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల సింగరేణి యాజ మాన్యం కూడా దృష్టి పెట్టడం లేదు. సంస్థ లాభాలకు పునాదులు వేసిన రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సత్వరమే సింగరేణి సంస్థ, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. హైదరాబాదులో ఏర్పాటు చేయనున్న సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి.
దండంరాజు రాంచందర్‌రావు
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News