బీడీసీ నిర్వాహకుల వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:36 AM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాలున్నాయి. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో శాఖా గ్రంథాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాలున్నాయి. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో శాఖా గ్రంథాలయాలున్నాయి. వీటికి అనుబంధంగా మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పుస్తక పంపిణీ కేంద్రాలు (బీడీసీ– బుక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్) పని చేస్తున్నాయి. ఆయా గ్రంథాలయాలకు పుస్తకాలు పంపిణీ చేయడం వీటి విధి. సాధారణంగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు) ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నులో (4–8 శాతం వరకూ) గ్రంథాలయ సెస్ కలిసి ఉంటుంది. ఈ నిధులే గ్రంథాలయాల నిర్వహణకు, అభివృద్ధికి ఆధారం. కానీ ఈ సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాలకు నిధులు అందడం లేదు. దీంతో గ్రంథాలయాల్లో నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ గ్రాంట్లు, దాతల సాయంతో కొంతమేరకు వీటిని నెట్టుకొస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో నిర్వహణ కష్టతరమవుతోంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. గ్రంథాలయ సెస్‌ను తప్పనిసరిగా వసూలు చేసి, ఆ నిధులను గ్రంథాలయాలకు చేరేలా శ్రద్ధ వహించాలి. బీడీసీల నిర్వాహకులకు ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.3వేలు గౌరవ వేతనం చెల్లిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో, దీనిని రూ.6వేలకు పెంచడంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.
జి. శ్రీరామమూర్తి, విజయనగరం
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News