ఈ వారం రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 03 , 2026 | 07:47 AM
వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 3 - 9 మే 2026 (పి.ప్రసూనా రామన్)
వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 3 - 9 మే 2026 (పి.ప్రసూనా రామన్)
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. రావలసిన ధనం అందదు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. సామ రస్యంగా మెలగండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. మీ అభిప్రా యాలను స్పష్టంగా తెలియజేయండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
ఆదాయం నిరాశాజనకం. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు అస్తవ్య స్తంగా సాగుతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుం టారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. కొత్తవారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. శుభకార్యానికి హాజరవుతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉం టాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడు పుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆశ్చర్యకర మైన సంఘటనలెదురవుతాయి. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్న కార్యం సిద్థిస్తుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను విశ్వసించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. పనులు సమయానికి పూర్తిచేయగల్గుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. పిల్లల పై చదువుల విష యాన్ని వారికే వదిలేయండి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు తొలగుతాయి. లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనుల్లో శ్రమ, ఒత్తిడి అధికం. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోద్దు. ఆశావహదృ క్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగి స్తాయి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వాగ్వాదాలకు దిగవద్దు. నోటీసులు అందుకుంటారు. అయినవారితో సంప్రదిం పులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రా యాలకు ప్రాధాన్యమివ్వండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ప్రతికూలతలను అధిగమి స్తారు. వ్యవహారానుకూలత ఉంది. లావా దేవీలు ఫలిస్తాయి. ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు, కార్యక్రమాలు చురు కుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. గృహనిర్మాణానికి రుణాలు మంజూరవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూల మవుతాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందు కుంటారు. కావలసిన వస్తువులు కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్ర హావేశాలు అదుపులో ఉంచుకోండి. పిల్లలు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. పనులు, బాధ్యతలు అప్పగించవద్ద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి పరిచయ స్తులను కలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యం సఫలమవుతుంది. విలాసాలకువ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఎవరినీ అతిగా నమ్మ వద్దు. అపరిచితులతో మితంగా సంభాషిం చండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వాహనం అమర్చు కోవాలనే కోరిక తీరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగి స్తుంది. పనులు ముందుకు సాగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఆస్తులు కొంటున్నారా..ఇవి చెక్ చేసుకోండి!
Read Latest Telangana News and National News