Share News

శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:50 PM

శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు దైవ దర్శనానికి టికెట్స్ బుకింగ్ విషయంలో అంతరాయం ఏర్పడింది. వెబ్ సైట్ సర్వర్ మెురాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా టికెట్ల బుకింగ్‌లో సమస్య తలెత్తింది.

శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య
Shri Shailam Temple

నంద్యాల: శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు దైవ దర్శనానికి టికెట్ల బుకింగ్ విషయంలో అంతరాయం ఏర్పడింది. వెబ్ సైట్ సర్వర్ మెురాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా టికెట్ల బుకింగ్‌లో సమస్య తలెత్తింది. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల బుకింగ్‌ చేసుకునేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నా డౌన్ లోడ్ అవ్వడం లేదు. వెబ్‌సైట్‌ బుకింగ్‌ హిస్టరీలోనూ బుక్కైనట్లు చూపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వెబ్ సైట్‌లో బుకింగ్ సమస్య ఉన్నట్లు ఆలయ అధికారులు సైతం ధ్రువీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావు సస్పెషన్.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం..

Updated Date - Apr 11 , 2026 | 06:55 PM