Share News

కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి..

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:44 AM

ఏడాదిలో 12 పౌర్ణమిలు పవిత్రమైనవే. కానీ వాటిలో కొన్ని మాత్రం పరమ పవిత్రంగా భక్తులు భావిస్తారు. అందులో ఒకటి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిని మరో మహాశివరాత్రిగా భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీ (మంగళవారం) వచ్చింది.

కార్తీక పౌర్ణమి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి..

ఇంటర్నెట్ డెస్క్: ఏడాదిలో 12 పౌర్ణమిలు పవిత్రమైనవే. కానీ వాటిలో కొన్ని మాత్రం పరమ పవిత్రంగా భక్తులు భావిస్తారు. అందులో ఒకటి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిని మరో మహాశివరాత్రిగా భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీ (మంగళవారం) వచ్చింది. పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 23 రాత్రి 11.42 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 24వ తేదీ రాత్రి 8.23 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం వేళ ఏ తిథి ఉంటే.. దానినే పరిగణిస్తారు. దీంతో నవంబర్ 24వ తేదీ కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు.


పూజ విధానం..

ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అనంతరం సముద్ర లేదా నదీ స్నానం ఆచరించాలి. నదికి వెళ్లలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేసి ఉపవాస సంకల్పం చెప్పుకోవాలి. శివలింగానికి పాలు,పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయాలి. శివునికి బిల్వ పత్రాలు సమర్పించాలి. మహా విష్ణువుని పూజిస్తే.. తులసీ దళాలు సమర్పించాలి. అనంతరం కార్తీక పురాణం చదవాలి.


360 వత్తులతో దీపం..

ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో 360 వత్తులతో దీపం వెలిగించాలి. ఆవునెయ్యిలో తడిపిన360 వత్తుల దీపం వెలిగించాలి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం వల్ల సకల దోషాలు తొలుగుతాయి. ఈ రోజు నదులు, చెరువులు, కోనేటిలో అరటి దొప్పల్లో మట్టి ప్రమిదలు ఉంచి దీపాలు వదలాలి. ఈ పౌర్ణమి సాయంత్రం వేళల్లో శివాలయంల్లో నిర్వహించే జ్వాలాతోరణం దర్శించుకొని ఆ మంటల కింద నడవటంవల్ల గ్రహ బాధలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.


365 వత్తులు ఎలా వెలిగించాలి..?

ఈ వత్తులతో దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కొవ్వొత్తులతో అస్సలు వెలిగించ కూడదు. అగరబత్తిని ఉపయోగించి ఈ వత్తులను వెలిగించాలి. అలా 365 వత్తులలో దీపారాధన చేయడం వల్ల ఇంటి యజమానికి అత్యత్తుమ ఫలితాలు లభిస్తాయి. ఇలా దీపారాధన చేసిన అనంతరం అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి.


ఉసిరికాయలతో దీపారాధన..

ఈ పౌర్ణమి రోజు చాలా మంది ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం వేళ దీపారాధన చేస్తారు. అలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయిని.. లక్ష్మీ దేవి అనుగ్రహం సైతం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

చంద్ర దర్శనం..

ఈ రోజు రాత్రి చంద్రుడిని దర్శించుకోవాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి.


ఈ రోజు ఏం దానం చేయాలి..?

పేదలకు అన్న, వస్త్రదానం చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు నువ్వులు, దీపాలను దానం చేయడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు.

ఈ రోజు ఏం చేయకూడదు..

మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. పరుష పదాలు వాడకుండా ఉండాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

నేటి రాశిఫలాలు.. 22-11-2026

For More Devotional News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 08:58 AM