'బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్'.. భర్త మర్డర్ కేసులో భార్య, ప్రియుడు దోషులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 08:43 PM
భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బ్లూ కలర్ డ్రమ్‌లో దాచిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
మీరట్, (యూపీ), సెప్టెంబర్ 30: భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించి, ఇద్దరు నిందితులపై మోపిన హత్య, ఆధారాల విధ్వంసం ఆరోపణలు నిజమని తీర్పునిచ్చారు.
మర్చంట్ నేవీ మాజీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్, ఆమె పాఠశాల నాటి స్నేహితుడు/ప్రియుడు సాహిల్ కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రాసెక్టోరియల్ టీమ్ కెమికల్, డిజిటల్, సాంకేతిక ఆధారాలతో పాటు 22 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. డ్రమ్, సిమెంట్, హత్యకు వాడిన చాకు కొనుగోలు చేసిన వ్యాపారుల సాక్ష్యాలు ఇందులో కీలకంగా మారాయి.
దోషులకు విధించే శిక్ష కాలాన్ని ఖరారు చేయడానికి కోర్టు 10 నుంచి 15 రోజుల సమయం కేటాయించింది. ఇది అత్యంత పాశవికమైన నేరమైనందున నిందితులిద్దరికీ మరణశిక్ష (ఉరిశిక్ష) పడాలని ఆశిస్తున్నట్లు ప్రాసెక్స్యూషన్ న్యాయవాది కృష్ణ కుమార్ దూబే తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్