చూసినా.. షేర్ చేసినా.. కటకటాలపాలే..
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:57 AM
స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకుని నడి వయ స్సు వరకు చాలా మంది పోర్నోగ్రఫీకి బానిసలవుతున్నారు.
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలపై ప్రత్యేక నిఘా
సెల్‌ఫోన్‌తో పెడదోవ పడుతున్నవైనం
అవగాహన లేమితో విద్యావంతులు సైతం జైలు పాలు
మంచిర్యాల: స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకుని నడి వయ స్సు వరకు చాలా మంది పోర్నోగ్రఫీకి బానిసలవుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్‌స్టేషన్ ప రిధిలో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదు కాగా వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
అశ్లీల వెబ్‌సైట్లపై ప్రత్యేక నిఘా
అశ్లీల వెబ్‌సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతుంది. పోర్నోగ్రఫీ వీడియోలు చూసినా, షేర్ చేసిన వారి వివరాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లకు అందించి కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాక పోయినా, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమ వుతుంది. ఒక వేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67 బీ పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
యువత పక్కదారి
విద్యార్ధి దశలోనే అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలోని అం డాలమ్మ కాలనీకి చెందిన ఓ బాలుడు పోర్న్ వీడియో లు చూసి మరో బాలికను వేధించినందుకు సదరు బా లిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. పిల్లలు సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీసు అధికా రులు సూచిస్తున్నారు.
సర్వర్లు బ్లాక్
పోర్న్ వెబ్‌సైట్‌లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయి స్తుంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్‌సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1,2 లాంటి అం కెలు చేర్చి మరో వెబ్‌సైట్ ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్‌సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్‌సైట్ల నిర్వాహ కుల వివరాలు తెలుసుకోవడానికి వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని పోలీ సులు చెబుతున్నారు.
ఇటీవల నమోదైన కేసులు
జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డుకు చెందిన ఓ యువకుడు యూట్యూబ్, పోర్న్ వెబ్‌సైట్లను చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయింటెడ్ చిల్డ్రన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.
జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుడి అడ్రస్‌తో సహా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించింది.
లక్షెట్టిపేటలో ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు సంబంధించిన అశ్లీల వీడియోలు పోస్టు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో అశ్లీల వీడియోల కోసం వెతుకుతూ బాలికకు సంబంధించిన వీడియోలు చూడడమే కాకుండా వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. విషయం గుర్తించిన లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరం
సీఐ ప్రమోద్‌రావు , మంచిర్యాల
పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. ఫోర్న్ వీడియో లు చూసినా, డౌన్‌లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా, స్టోరేజీ చేసినా తెలిసిపోతుంది. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమో దు చేస్తున్నాం. ప్రభుత్వం నిషేధించిన పోర్న్ వెబ్ సైట్‌లను చూడొద్దు. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా ఇందులో ముగ్గురు మైన ర్లు ఉన్నారు. అశ్లీల వెబ్‌సైట్‌ల పై పూర్తిస్థాయి నిఘా ఉంది. యు వత పోర్న్ వీడియోలు చూడ కుండా చదువుతో పాటు క్రీడ ల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇంటి లోన్ తీర్చడానికి.. మరో ఇంటికి కన్నం!
తప్పు చేస్తున్నామని తెలుసు.. మాకు వేరే దారి లేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News