బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృతి.. భార్యపై అనుమానం..
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:43 PM
బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మృతుడి భార్య హరిణిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదులోని ఆరోపణలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది (Husband Son killing).
అభినందన్ తన భార్య హరిణి, కుమారుడితో కలిసి ఉత్తర బెంగళూరులోని చిక్కబాణవారలో నివసించేవారు. సోమవారం అభినందన్, ఆయన చిన్న కుమారుడు మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య నిద్రించే విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో హరిణి తన భర్తపై గరిటెతో దాడి చేసింది. అనంతరం ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించినట్లు సమాచారం (Bengaluru Double killing).
ఆ తర్వాత హరిణి తన ప్రియుడైన వినయ్‌ను ఇంటికి పిలిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు (Bengaluru Crime). అనంతరం ఇద్దరూ కలిసి అభినందన్‌పై దాడి చేసి, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో నాలుగేళ్ల కొడుకు మేల్కొనడంతో, ఆ బాలుడిని కూడా దిండు ఉపయోగించి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరింత ఆధారాలను సేకరిస్తున్నారు. హరిణి ప్రియుడు వినయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్.. పోలీస్ అధికారి, జర్నలిస్టు సహా నలుగురు అరెస్ట్..