టిమ్ కుక్ స్థానంలోకి జాన్ టర్నెస్.. పాతికేళ్లు ఒకే సంస్థలో....
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:56 PM
చేరిన తొలి ఉద్యోగంలోనే పాతికేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. వేరే కంపెనీలోకి మారే ఉద్దేశమే లేదన్నట్టుగా కెరీర్ సాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే యాపిల్‌కు కాబోయే సీఈవో జాన్ టర్నెస్ మాత్రం యాపిల్‌నే నమ్ముకున్నారు.
చేరిన తొలి ఉద్యోగంలోనే పాతికేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. వేరే కంపెనీలోకి మారే ఉద్దేశమే లేదన్నట్టుగా కెరీర్ సాగించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే యాపిల్‌కు కాబోయే సీఈవో జాన్ టర్నెస్ మాత్రం యాపిల్‌నే నమ్ముకున్నారు. ఉద్యోగిగా యాపిల్‌లో చేరి, పాతికేళ్ల పాటు అక్కడే పని చేసి, మరో ఐదు నెలల్లో ఏకంగా అదే కంపెనీకి సీఈవో అయిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీని నడిపించే బాధ్యతలు తీసుకుంటున్నారు (John Ternus).
ప్రస్తుతం జాన్.. యాపిల్ హార్డ్‌వేర్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. టిమ్ కుక్ స్థానంలో 2026, సెప్టెంబర్ 1 నుంచి యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జాన్ 2001లో యాపిల్‌లో జాయిన్ అయ్యారు. యాపిల్ మ్యాక్‌బుక్, ఎయిర్ పాడ్స్, ఐపాడ్స్ తయారీ వెనుక జాన్ కృషి ఎంతో ఉంది. యాపిల్‌కు 80 శాతం ఆదాయం తీసుకొచ్చే పరికరాలు జాన్ పర్యవేక్షణలోనే తయారవుతాయి. మ్యాక్‌బుక్‌లలో చిప్‌లను అనుసంధానం చేయడంలో జాన్ కీలక పాత్ర పోషించారని, ఆ తర్వాతే వాటి విక్రయాలు భారీగా పుంజుకున్నాయని సమాచారం (Tim Cook successor).
ప్రస్తుతం జాన్ టర్నెస్ వయసు 50 ఏళ్లు మాత్రమే. యాపిల్‌లోని చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల కంటే చిన్నవాడు (Apple leadership change). అయినప్పటికీ జాన్ టర్నెస్‌పై కంపెనీ నమ్మకముంచింది. సీఈవో హోదాలో టిమ్ కుక్ విడుదల చేయాల్సిన కొన్ని ఉత్పత్తులను టర్నెస్ ద్వారా విడుదల చేయించింది. ఐఫోన్ 17 ఎయిర్, మ్యాక్ బుక్ నియోను టర్నెస్ ప్రదర్శించారు. ఏదేమైనా టర్నెస్ నియామకంతో హార్డ్‌వేర్ వైపు కూడా యాపిల్ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. అలాగే టర్నెస్ నేతృత్వంలోని యాపిల్ ఇకపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై కూడా దృష్టి సారించనుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..