యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టిమ్ కుక్.. ఆయన ఆస్తి ఎంతంటే..
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:10 PM
దాదాపు దశాబ్దంన్నర పాటు యాపిల్‌ను నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
దాదాపు దశాబ్దంన్నర పాటు యాపిల్‌ను నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2026 తర్వాత టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు (Apple CEO change).
టిమ్ కుక్ 2011లో యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టే నాటికి యాపిల్ విలువ 350 బిలియన్ డాలర్లు. కుక్ పదవీ కాలంలో యాపిల్ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఆయన హయాంలో యాపిల్ విలువ దాదాపు 20 రెట్లు పెరిగింది. టిమ్ పదవీ కాలాన్ని యాపిల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన దశగా భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ను అత్యంత విలువైన సంస్థగా మార్చే క్రమంలో టిమ్ కుక్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం టిమ్ కుక్ నికర ఆస్తుల విలువ 2.9 బిలియన్ డాలర్లు (రూ.27 వేల కోట్లు). అయితే ఆ మొత్తంలో ఎక్కువ భాగం యాపిల్ స్టాక్స్ రూపంలోనే ఉన్నాయి. టిమ్ కుక్ సీఈవో అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 200 యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యాపిల్‌కు వివిధ దేశాల్లో మొత్తం 540కి పైగా స్టోర్లు ఉన్నాయి (Tim Cook Networth).
ఐబీఎంలో దాదాపు 12 ఏళ్ల పని చేసిన తర్వాత 1998లో టిమ్ కుక్ యాపిల్‌లో చేరారు (Apple new CEO 2026). ప్రారంభంలో ఆపరేషన్స్ అండ్ సప్లయి చైన్ విభాగంలో పని చేశారు. తర్వాత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. అనారోగ్య కారణాలతో స్టీవ్ జాబ్స్ వైదొలగడంతో ఆయన స్థానంలో 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..