టాటా గ్రూప్‌లో పరిణామాలపై కన్నేసి ఉంచాం..
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:56 AM
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో పాలనకు సంబంధించిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే...
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
కోల్‌కతా: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో పాలనకు సంబంధించిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే శనివారం తెలిపారు. ఎందుకంటే, ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు, వాటి ప్రమోటర్లు సెబీ నిబంధనల పరిధిలోకి వస్తాయన్నారు. ‘‘టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ స్థాయి లో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అది లిస్టెడ్ కంపెనీ కానప్పటికీ, గ్రూప్‌లోని పలు కీలక కంపెనీలు మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. అవి లిస్టింగ్ ఆబ్లిగేషన్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్ (ఎల్‌ఓడీఆర్) నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని’’ ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాలో శనివారం భారత్ చాంబర్ ఇన్వెస్టర్స్ ఫోరమ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ వ్యాఖ్యలు చేశారు. టాటా సన్స్ లిస్టింగ్‌తో పాటు కంపెనీ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్న నేపథ్యంలో సెబీ చైర్మన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మదుపరుల రక్షణకు పెద్దపీట
దేశీయ క్యాపిటల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మదుపరుల ప్రయోజనాల రక్షణను బలోపేతం చేస్తున్నట్లు సెబీ చైర్మన్ చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పట్టించే పెట్టుబడి సలహాలు, అవాస్తవిక రిటర్నుల హామీలు, కొత్త మార్గాల్లో డిజిటల్ మోసాలను కట్టడి చేయడంపై దృష్టి సారించామన్నారు. క్యాపిటల్ మార్కెట్లలోకి మరింత సులభంగా ప్రవేశించటంతో పాటు మార్కెట్ సామర్థ్యం, స్థితిస్థాపకత పెంపు, సులభంగా పెట్టుబడులకు వీలు కల్పించడం, వ్యాపారాన్ని సులువుగా మార్చడం, మదుపరులకు మరింత రక్షణ దిశగా సెబీ కృషి చేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News