టెలికాం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు
ABN , Publish Date - May 15 , 2026 | 05:18 AM
ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, టెలికాం, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో...
సెన్సెక్స్ 790 పాయింట్లు అప్
ముంబై: ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, టెలికాం, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అయితే, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు లాభాలకు కొంత అడ్డుకట్ట వేశాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా పెరిగి 75,681.88 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 789.74 పాయింట్ల (1.06 శాతం) లాభంతో 75,398.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 277 పాయింట్లు (1.18 శాతం) బలపడి 23,689.60 వద్దకు చేరుకుంది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.52 లక్షల కోట్లు పెరిగి రూ.462.85 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన రెండు సెషన్లలో మార్కెట్ సంపద రూ.6.82 లక్షల కోట్ల మేర పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News