9 నెలల గరిష్ఠానికి సూచీలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:55 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు భారీగా లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 772.75 పాయింట్ల లాభంతో దాదాపు 9 నెలల (ఫిబ్రవరి 26నాటి) గరిష్ఠ స్థాయి...
సెన్సెక్స్ 772 పాయింట్లు అప్
రూ.4.31 లక్షల కోట్ల లాభం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు భారీగా లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 772.75 పాయింట్ల లాభంతో దాదాపు 9 నెలల (ఫిబ్రవరి 26నాటి) గరిష్ఠ స్థాయి 81,879.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 210.40 పాయింట్ల వృద్ధితో 25,255.05 వద్ద ముగిసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.31 లక్షల కోట్లు పెరిగి రూ.510.72 లక్షల కోట్లకు(5.44 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల జోరు, అంచనాలను మించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, చమురు ధరల్లో తగ్గుదల ఇందుకు దోహపడ్డాయి. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.12,563.33 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.8,434.53 కోట్ల నికర విక్రయాలు జరిపారు.
ఈక్విటీ ఫండ్ల పెట్టుబడుల్లో 14% క్షీణత
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై ప్రభావం చూపాయు. సెప్టెంబర్‌లో రూ. 38,306 కోట్లుగా నమోదైన ఈక్విటీ ఫండ్లలో నికర పెట్టుబడులు అక్టోబరులో 14 శాతం తగ్గి రూ. 32,994 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్‌లో చోటుచేసుకున్న దిద్దుబాటు ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని భారత మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ సమాఖ్య (యాంఫీ) వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News