Share News

సెన్సెక్స్‌ 390 పాయింట్లు అప్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:27 AM

విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్ను, ఐటీ షేర్లలో భారీగా కొనుగోళ్లతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు రెండో రోజూ...

సెన్సెక్స్‌ 390 పాయింట్లు అప్‌

ముంబై: విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్ను, ఐటీ షేర్లలో భారీగా కొనుగోళ్లతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 390.31 పాయింట్ల వృద్ధితో 84,328.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.25 పాయింట్లు పెరిగి 25,884.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని హెచ్‌సీఎల్‌ టెక్‌ 6.28 శాతం వృద్ధితో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టీసీఎస్‌ 4.97 శాతం, ఇన్ఫోసిస్‌ 4.70 శాతం, టెక్‌ మహీంద్రా 3.33 శాతం బలపడ్డాయి. దాంతో బీఎస్ఈలోని ఐటీ, ఫోకస్డ్‌ ఐటీ సూచీలు 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఇక స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు 0.78 శాతం వరకు పెరిగాయి. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.57 లక్షల కోట్లు పెరిగి రూ.514.05 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:27 AM